ఇంత అందం ఉన్నా మెహ్రీన్‌ కు… ఆఫర్లు మాత్రం అందని ద్రాక్ష‌లా మారాయే..!

సినిమా పరిశ్రమ అంటేనే ఓ మాయా ప్రపంచం.. ఇందులో కొంతమంది సిని తారలు హిట్స్ అందుకున్న క్రేజ్ రాదు… సినిమా హిట్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్ల ఖాతాలో అది పడదు. హిట్లు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రావు మరి కొంతమందికి. ఈ లిస్ట్ లో ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో అందాల ముద్దుగుమ్మ కూడా చేరింది.. ఆ ముద్దుగుమ్మ మరి ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ పిర్జాదా.

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. తన నటన అభినయంతో తన గ్లామ‌ర్ షో తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది. ఈమె తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. అయితే గత కొంతకాలంగా మెహ్రీన్ వరుస ఫ్లాప్‌లు పలకరించాయి.

Actress Mehreen Pirzada Enjoying Her Vacation at Dubai | Mehreen Pirzada  GLAMOROUS Video | LATV - YouTube

అయితే ఇటీవల వచ్చిన ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెహ్రీన్. అనీల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఎఫ్2 సినిమా కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. కానీ ఈ సక్సెస్ వెంకటేష్- వరుణ్ తేజ్ ఖాతాలోకి వెళ్ళింది. అయితే ఈ సినిమాలో మెహ్రీన్ తన నటనతో తన గ్లామర్ పరంగా కూడా అందరిని మెప్పించింది.

హాట్ షోతో రచ్చ చేసిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా: ఆమెను ఇలాంటి ఫోజుల్లో  ఎప్పుడైనా చూశారా? | Mehreen Kaur Pirzada Unseen Hot Photos Gone Viral -  FilmiBeat Telugu

ఇలాంటి సూపర్ సక్సెస్ తర్వాత మెహ్రీన్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాల‌ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతవరకు ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటిస్తుంది అన్నది క్లారిటీ లేదు. సినిమా అవకాశాలు లేకపోవడంతో మెహరీన్ వరుసగా వెకేషన్ కు వెళ్తూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ కాలం వెల్లదీస్తుంది. ఇలా సినిమా అవకాశాలు రాకపోతే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఉందని అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ ఎందుకు రావట్లేదని అభిమానులు ఆలోచిస్తున్నారు.

Share post:

Latest