గత సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఒకటి. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది.
ఇక అలాంటిది ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో హీరో ఎవరో తెలియదు అంటూ అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఆలీతో సరదాగా షో కు తెలుగులో ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అయినా ఎల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన రీసెంట్ ప్రోమో ని మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. ఆ ప్రోమో లో విజయలక్ష్మి తన సినీ జీవితం గురించి తన బాల్యం గురించి తను ఎదుర్కొన్న కష్టాలు అన్నిటి గురించి ఆలీతో తన విషయాలను పంచుకుంది. ఇక ఎన్టీఆర్, విజయలక్ష్మి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా ఆమె ఆలీతో పంచుకుంది.
ఎన్టీఆర్ తనను ముద్దుగా కోడలా కోడలా అని పిలిచే వారని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో గుండమ్మ కథ సినిమాలో సాంగ్ లో నటించాను కానీ అనుకోని కారణాల వల్ల ఆ సాంగ్ తీసేసారంటూ ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయినా ఈమె రీసెంట్గా ఇండియాకు వచ్చారు. ఈ తరుణంలోనే ఆలీ ఈ తరం హీరోస్ లో నటించిన ఏ సినిమా చూశారని అడగగా ఆమె పుష్ప సినిమా చూశానని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో హీరో ఎవరో మీకు తెలుసా..? అని ఆలీ అడగగా నాకు తెలియదు అని ఆమె చెప్పింది. అప్పుడు అతను మరెవరో కాదు మీ సహనటుడు అల్లు రామలింగయ్య మనవడు అని చెప్పగా.. అప్పుడు ఆమె ఈమధ్య కాలంలో ఇప్పుడున్న హీరోలు గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు, ఎన్టీఆర్ మానవుడు అని చెప్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. అల్లు అర్జున్ గురించి ఆమె అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.