వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గేదేలే.. మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ప‌ట్టిన కృతి శెట్టి!?

ఉప్పెన సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైన యంగ్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్‌ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఇటీవల మాత్రం కృతి శెట్టి టైం అస్స‌లు బాలేదని చెప్పాలి. ఈమె నటించిన `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలు ప్రేక్షకుల‌ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

అయితే వరుస ఫ్లాపుల్లోనే కృతి శెట్టి తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతుంది. ఇక తాజాగా కృతి శెట్టి మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను కొట్టేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా `ఒకే ఒక జీవితం` సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య అనే యువ దర్శకుడు తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఫ్యామిలీ కథతో పాటు ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొదిద్దుకోనున్న ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ వర్క్‌ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా కృతి శెట్టిని ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో కృతి వెంటనే శ‌ర్వాకు జోడీగా న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితం కానన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Share post:

Latest