తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఓవర్ నైట్ కి స్టార్ డం సంపాదించి స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఇప్పటివరకు ఉండే కొంతమంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ తెలుసుకోవాలని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. అలా ఇప్పటివరకు హైయెస్ట్ గా తీసుకొనే కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
అనుష్క శెట్టి:టాలీవుడ్ లో సూపర్ సినిమాతో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్స్ సినిమాలలో నటించింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది అనుష్క ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ 7 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం
రష్మిక:ప్రస్తుతం ఎక్కువగా రష్మిక హవానే ఎక్కువగా కొనసాగుతోందని చెప్పవచ్చు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ.2.5 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.
సమంత:రీసెంట్గా విడుదలైన యశోద చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.3.2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.
పూజా హెగ్డే:ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి ఈ మధ్యకాలంలో.. అయినా కూడా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఒక్కో చిత్రానికి పూజ హెగ్డే రూ.2.3 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.
నయనతార:లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన నాయనతార ప్రస్తుతం పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి నయనతార దాదాపుగా రూ.12 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.
ఇక విరే కాకుండా ఎంతో మంది హీరోయిన్స్ కోటి రూపాయల పైన అందుకుంటున్నట్లు తెలుస్తోంది.