`ఎన్టీఆర్ 30`పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేక‌ర్స్‌.. ఇక ఆ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టే!

ఈ ఏడాది ఆరంభంలో `ఆర్ఆర్ఆర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన త‌దుప‌రి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు.

మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరింబోతుండ‌గా.. అనిరుధ్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. స‌మ్మ‌ర్ లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతూనే వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీపై మేక‌ర్స్ ఓ క్రేజీ అప్డేట్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

తాజాగా కొరటాల మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌తో కలిసి మ్యూజిక్‌కు సంబంధించిన విషయాలను చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను చిత్ర టీమ్ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు, బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌కు చ‌ర్చ‌లు షురూ అయ్యాయి అంటూ పేర్కొంది. ఇక కొర‌టాల మ్యూజిక్ పై దృష్టి సారించాడంటే ఖ‌చ్చితంగా ఫుల్ స్క్రీప్ట్‌ను పూర్తి చేసే ఉంటాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యే స‌మ‌యంలో కూడా ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి మేక‌ర్స్ ఇచ్చిన తాజా అప్డేట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Share post:

Latest