ఇటు కేరళ అటు హర్యానా.. మధ్యలో టాలీవుడ్..!!

టాలీవుడ్ లో ఒకవైపు పూజ హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇక వీళ్లు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస‌ సినిమాలలో నటించడంతో. ఇక్కడ ఉన్న కుర్ర హీరోలతో జోడి కట్టడానికి కృతి శెట్టి, శ్రీ లీల వంటి హీరోయిన్లు జోరు మీద ఉన్నారు. వీరితో పాటుగా రీసెంట్గా మరో ఇద్దరు కుర్ర హీరోయిన్లు పేరులు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సంయుక్త మీనన్ మరొకరు మీనాక్షి చౌదరి.

సంయుక్త మీనన్ 2016లో మలయాళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్ సినిమాలో కూడా ఈమె నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లోనే సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆమె చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఈమెకు వరుస‌ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక సంయుక్త ప్రస్తుతం ధనుష్‌కు జోడిగా ద్విభాషా చిత్రమైన సార్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Actress and beauty pageant titleholder Meenakshi Chaudhary Gorgeous  Images-మీనాక్షి చౌదరి గ్లామరస్ ఇమేజస్ - Actress And Beauty Pageant  Titleholder Meenakshi Chaudhary Gorgeous Images - Meenakshianand

ఇక మీనాక్షి చౌదరి విషయాని వ‌స్తే తాను హర్యానా ముద్దుగుమ్మ అయినా.. ఈమె తెలుగులో సుశాంత్ కు జోడిగా ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాలో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయినా మీనాక్షి తర్వాత రవితేజతో జోడిగా ఖిలాడి సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన నటనతో తన అందంతో గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మీనాక్షి తనకు కావాల్సిన మార్కులను రప్పించుకుంది. ఈమె ప్ర‌స్తుతం అడివి శేష్‌కు జోడిగా హిట్2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్2న‌ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ముద్దు గుమ్ములు ఇద్దరు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో నిలదొక్కుకుంటారనేది చూడాలి.