సక్సెస్ కోసం ఆ డైరెక్టర్ వెంట నితిన్.. సక్సెస్ అయ్యేనా..!!

నితిన్ హీరోగా యువ దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ తెరమీదకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రధానంగా భీష్మ సినిమాలో పాటలు నితిన్ కామెడీ టైమింగ్, రష్మిక పర్‌ఫార్మెన్స్‌, వాళ్ళిద్దరి మీద వచ్చే రొమాన్స్ సీన్స్ ఇవన్నీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే కథ‌ టేకింగ్ డైలాగులు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుంది అంటేనే అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు.

Nithin's next film with Venky Kudumula

వెంకీ కుడుముల భీష్మ తర్వాత మరో సినిమా చేయలేదు. ఆ సినిమా తర్వాత నుంచి ఇప్పటివరకు ఆయన ఖాళీగానే ఉన్నాడు. చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్గా బాలకృష్ణ కూడా వెంకీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా మొదలయ్యే లోపు నితిన్ సినిమాని త్వరగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట వెంకీ. అలానే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్గా నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ కాంబో సినిమా గురించి అతి త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించిన ఉన్నారని తెలుస్తుంది.