తగ్గని బాబు..కే‌ఈ ఫ్యామిలీ సర్దుకున్నట్లే..!

ఒకప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అంటే మొదట గుర్తుచ్చేది కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీనే..ఆ జిల్లాలో కాంగ్రెస్ హవా ఉన్న సమయంలో, ఆ తర్వాత వైసీపీ హవా  నడుస్తున్న సమయంలోనూ పార్టీకి అండగా నిలబడింది ఆ ఫ్యామిలీనే. అందుకే 2014లో కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి సైతం ఇచ్చారు. అటు కే‌ఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.  అయితే 2019లో ఓటమి తర్వాత ఆ ఫ్యామిలీ కాస్త టీడీపీకి దూరం జరిగింది..తమ నియోజకవర్గాలని కూడా పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు..కే‌ఈ ఫ్యామిలీకి ఒక సీటు కట్ చేశారు. మొదట పత్తికొండ, డోన్ సీట్లు ఆ ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి.

అయితే డోన్‌లో ఓడిపోయిన కే‌ఈ మరో సోదరుడు ప్రతాప్..పార్టీలో యాక్టివ్ గా లేరు..దీంతో ప్రభాకర్‌కు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆయనకు సరిగ్గా పనిచేయలేదు. దీంతో సుబ్బారెడ్డిని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన దూకుడుగా పనిచేస్తుండటంతో దాదాపు డోన్ సీటు సుబ్బారెడ్డికి ఫిక్స్ చేశారు.

ఇక యాక్టివ్ గా పనిచేయకపోతే పత్తికొండ సీటు కూడా పోయేలా కనిపించింది. దీంతో అక్కడ కే‌ఈ కృష్ణమూర్తి వారసుడు శ్యామ్ యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజులుగా కే‌ఈ ఫ్యామిలీ పత్తికొండతో పాటు డోన్ గాని కర్నూలు సిటీ సీటు గాని ఇవ్వాలని కోరుతున్నారు. కానీ బాబు కే‌ఈ ఫ్యామిలీని ఒక్క సీటుకే పరిమితం చేశారు. ఇక కే‌ఈ ఫ్యామిలీకి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

అయితే ఆ ఫ్యామిలీ మధ్యలో పార్టీ మారుతుందని ప్రచారం జరిగింది..కానీ తాజాగా బాబు కర్నూలు టూర్ లో కే‌ఈ ఫ్యామిలీ వచ్చింది. పత్తికొండ రోడ్ షో మొత్తం శ్యామ్ చూసుకున్నారు. మొత్తానికి కే‌ఈ ఫ్యామిలీ ఒక్క పత్తికొండ సీటు సర్దుకున్నట్లే అని చెప్పొచ్చు. ఇక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది.

Share post:

Latest