బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో అలరిస్తున్న కత్రినా కైఫ్ రీసెంట్ గానే తాను ప్రేమించిన హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది . చాలా గ్రాండ్ గా ధూమ్ ధామ్ అంటూ పెళ్లి జరుపుకున్న కత్రినా రీసెంట్గా ఇంటర్వ్యూలో తన పెళ్లి రోజు జరిగిన సీక్రెట్స్ ని బయటపెట్టింది.
కత్రినా మాట్లాడుతూ..” మా పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది . మేము అనుకున్న దానికన్నా డబుల్ రేంజ్ లో పెళ్లి జరగడం ఒక ఆనందమైతే ..ప్రతి పని సాంప్రదాయ బద్ధంగా చేసుకోవడం మనసుకు హాయిగా అనిపించింది . మా పెళ్ళిలో మేము ముఖ్యంగా కేర్ తీసుకున్నది ఒకటే . మా పెళ్లి చాలా ట్రెడిషనల్ గా జరగాలి అన్ని ..సాంప్రదాయాలు ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాం. ఈ కారణంగానే మేము ఫోన్ ఎవరికి అలౌ చేయలేదు .అంతేకాదు పెళ్లి ఫిక్స్ అయిన ముహూర్తం నుండి మేము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాం.”.
” ఎక్కడ గొడవలు జరగకుండా వచ్చిన వారందరికీ కడుపునిండా భోజనం పెట్టేలా.. మీడియా వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యాం. అయితే నా పెళ్లి అనుకున్నట్టు గ్రాండ్గా జరిగింది.. నేను విక్కీ కౌశల్ చాలా హ్యాపీగా ఉన్నాం. నా మెడలో తాళి కట్టేశారు. ఏడడుగులు వేసేసాం అంత హ్యాపీగా ఉంది నా లైఫ్ ఇంకా కలర్ ఫుల్ గా ఉంది అనుకుంటూ మురిసిపోతున్నాను. అయితే సడన్గా నా వెనక నుండి ఏవో గట్టిగట్టిగా అరుపులు ఏంటి అంటూ తిరిగి చూసేసరికి జుట్టును పట్టుకొని చెప్పులతో కొట్టుకుంటున్నారు. షాక్ అయిపోయాను .
అక్కడ చెప్పులతో కొట్టుకుంటున్నది విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ నా చెల్లెలు . అయితే అది సరదా గొడవనుకుని లైట్ తీసుకున్నాను . కానీ తర్వాత అర్థమైంది అది సీరియస్ గొడవ అని . కానీ ఇప్పటికీ ఆ గొడవని నేను కంక్లూడ్ చేయలేకపోయాను “అంటూ చెప్పుకువచ్చింది. దీంతో కత్రీనా కామెంట్స్ వైరల్ గా మారాయి . అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..?