మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో `ఆర్సీ15` షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం న్యూజిలాంగ్ లో చరణ్, కియారాలపై ఓ డ్యూయెట్ సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ పిక్స్ కు `స్టిల్ ఇన్ థాట్స్` అనే క్యాప్షన్ ఇచ్చాడు. అయితే చరణ్ స్టైలిష్ లుక్ కు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఫిదా అయిపోయింది. అంతేకాదు, చరణ్ పిక్స్ పై లైక్ కూడా కొట్టేసింది. దీంతో చరణ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, ఆర్సీ 15 విషయానికి వస్తే.. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర, సునీల్, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.