సౌత్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో లాక్డౌన్ సమయంలో ముంబైలో స్థిరపడ్డ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది గర్భం దాల్చడం తో నటనకు బ్రేక్ ఇచ్చింది.
ఇక ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న `భారతీయుడు 2` చిత్రంలో భగమయింది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులను సైతం ఆమె టేకప్ చేసిందట. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ పలు కండిషన్స్ పెడుతుందట.
ముఖ్యంగా ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ కథలు చేయడానికి ససేమిరా నో అంటుందట. రీసెంట్ గా సైతం ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను ఆమె రిజెక్ట్ చేసిందని అంటున్నారు. మునుపటిలా గ్లామర్ రోల్స్ చేయడానికే కాజల్ మక్కువ చూపుతోందని తెలుస్తోంది. అలాంటి పాత్రలే తనకు కావాలని, అప్పుడే సినిమా చేస్తానని దర్శక నిర్మాతలకు చెబుతుందట. మరి కాజల్ ఆశించినట్టు ఆమెకు గ్లామర్ రోల్స్ వస్తాయా? లేదా? అన్నది చూడాలి.