సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో విలన్ గా ట్రై చేయగా అందులో సక్సెస్ అవడం జరిగింది. దీంతో హీరోయిన్గా కంటే ఇమే పలు సినిమా భాషలలో విలన్ గాని నటిస్తూ బిజీగా ఉంటోంది. తాను ఒక స్టార్ నటుడు కూతురు అయినప్పటికీ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి పది సంవత్సరాలు అయిన సోషల్ మీడియా ద్వారా తాజాగా ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది.
హీరోయిన్గా వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్న సినిమాల కంటే ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్యారెక్టర్లే ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ లో వరస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా మారిపోయింది. తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈమె. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపుగా 45 సినిమాలలో నటించినట్లుగా తెలియజేస్తోంది. ఈమధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్ కూడా అతి తక్కువ సమయంలో ఇన్ని సినిమాలు చేసిన పరిస్థితి కనిపించలేదని సమాచారం.
యాక్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ తనని తాను ప్రూఫ్ చేసుకునేందుకు పలు ఛాలెంజింగ్ సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది.తను నటించే ప్రతి పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. తన సినీ కెరియర్లో అమ్మ ప్రోత్సహించడం వల్లే ఇలా సహకారం అయిందని మీడియా ముందు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో తెలియజేసింది వరలక్ష్మి. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.
View this post on Instagram