ఒకే వ్య‌క్తితో శ్రీ‌దేవి కుతుళ్లు డేటింగ్‌.. ఇదెక్క‌డి చోద్యంరా నాయ‌నా?

బాలీవుడ్ సిస్టర్స్ జాన్వి కపూర్, ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ అక్కచెల్లెళ్ల కన్నా మంచి స్నేహితుల లాగా ఉంటారు. వీరిద్దరూ కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తూ.. గెట్ టూ గెదర్ లకు హాజరవుతూ.. పాలు నీళ్ళలా కలిసిపోతూ కనిపిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా తేడా ఉంది అంటే అది జాన్వి నటిగా తెరంగేట్రం చేసింది ఖుషి ఇంకా చెయ్యలేదు అది ఒక్కటే కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలో అక్కకి తగ్గ చెల్లెలు ఉంటుంది.

ఇక జాన్వి కపూర్ ఎఫైర్ల గురించే అయితే చాలానే ఉన్నాయి. వారిలో అక్షత్ రంజన్.. శిఖర్ పహారియాలతో ఇండస్ట్రీకి రాకముందు ఎఫైర్ సాగించిందని చాలా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఇషాన్ కట్టర్ తోను కొన్నాళ్లపాటు సహజీవనం చేసిందని.. ఇలా ఈ లిస్టులో చాలామంది ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి విషయాల్లో ఖుషి కపూర్ గురించి మాత్రం బయటకు రాలేదు.

ఇలాంటి తరుణంలో ఈ అక్కా చెల్లెళ్ళిద్ద‌రి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. అది జాన్వీ కపూర్ మరియు ఖుషి కపూర్ ఓకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు ఓ వార్త బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఓ ప్రముఖ బిజినెస్ మాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కాదు.. ఒకప్పటి జాన్వి మాజీ బాయ్ ఫ్రెండ్ అట. ఆ బిజినెస్ మాన్ పేరు అక్షత్ జైన్. కాగా జాన్వి చిన్ననాటి ఫ్రెండ్ మరియు ఎక్స్ బాయ్ ఫ్రెండ్.

ప్రస్తుతం ఈ అక్క చెల్లెలు ఇద్దరు అతనితోనే జంటగా రొమాన్స్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. జాన్వి తాను ప్రేమించిన ప్రియుణ్ణి మర్చిపోలేక మళ్ళీ రిలేషన్ షిప్ లోకి దిగినట్లు అంతేకాకుండా చెల్లికి తెలియకుండా రహస్యంగా మీట్ అవుతున్నట్లు బాలీవుడ్ గుసగుసలాడుకుంటుంది. ఈ విషయంపై స్పందించిన నెటిజనులు ఒకే వ్యక్తితో అక్క చెల్లెలు ఇద్దరు డేటింగ్ ఏంటి? ఛండాలంగా ఇదెక్కడి చోద్యం రా నాయనా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest