తనపై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన జగపతిబాబు..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో విలన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు ప్రేక్షకులను. దీంతో జగపతిబాబు బాగానే సంపాదిస్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వెటకారంగా జగపతిబాబు బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సినీ నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు నటుడుగా ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తన విలనిజంతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Jagapathi Babu's role in 'Aravindha Sametha' is scary | The News Minuteఆ తర్వాత వచ్చిన రంగస్థలం, అరవింద సమేత తదితర చిత్రాలలో విలన్ గా నటించి.. హీరో గానే కాకుండా విలన్ గా కూడా మెప్పించగలను అనే నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు జగపతిబాబు. దీంతో జగపతిబాబు గత కొద్ది రోజులుగా ఆస్తులను భారీగానే సంపాదించారు అని చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్నోసార్లు బదిలిచ్చిన జగపతిబాబు ఆ ప్రశ్నలు మాత్రం వైరల్ గా మారుతూ ఉండడంతో దీంతో విసుగు పోయిన జగపతిబాబు వారందరికీ కౌంటర్ ఇస్తూ తాజాగా ట్విట్టర్ నుంచి ఒక విషయాన్ని షేర్ చేశాడు.

తన ఇంటిలో సాయిబాబా విగ్రహానికి పూజ చేస్తున్న ఒక వీడియోని షేర్ చేస్తూ” దేవుడా అందరూ నా దగ్గర ఉన్నదనుకుంటున్న డబ్బులు నాకు ఇచ్చేయి వాళ్ళకి సమాధానం చెప్పలేక చస్తున్నాను అంటు” ఒక క్యాప్షన్ ని ఇస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం సౌత్లో వరుస సినిమాలు చేస్తూ సెకండింగ్స్ లో దూసుకుపోతున్నారు జగపతిబాబు.

Share post:

Latest