తమిళంలో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్. తన తండ్రి వారసత్వాన్ని వాడకుండా కేవలం సొంత టాలెంట్ తో మొదటిసారిగా హీరోయిన్గా ఎదిగిన ఈమె అంతగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా నటిస్తూ ప్రయోగాత్మకంగా పాత్రలలో నటిస్తూ ఉన్నది. ముఖ్యంగా పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఆ సినిమాలని సక్సెస్ ఫుల్ రన్ అయ్యేలా చేస్తూ ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు జయమ్మ పాత్రలో ఒదిగిపోయినటించడంతో ఈమె పేరును ముద్దుగా జయమ్మ అని పిలుస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.
అయితే ఎంతోమందికి సమాజ సేవ చేసిన వరలక్ష్మిపై లైంగిక దాడి జరిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిన్న వయసులో తనపై లైంగిక దాడి జరిగిందని ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. అంతేకాకుండా ఒక టీవీ ఛానల్ అధినేత తనను తనతో పడుకోవాలంటూ అడిగారని.. ఆ వెంటనే పోరా పోరంబోకు అని చెయ్యి చేసుకోపోయేసరికి పారిపోయాడని తెలియజేసింది. ఇమే… ఇక తన కెరియర్ విషయానికి వస్తే వరలక్ష్మి తన నటిగా అవ్వాలనుకున్నప్పుడు తన తండ్రి శరత్ కుమార్ వద్దన్నారని కానీ తన తల్లి రాధిక మాత్రం తను ఇండస్ట్రీలోకి వెళ్తే చాలా కష్టాలను ఎదురుకోవాల్సి వస్తుందని తెలియజేసిందట.. అయితే తన తల్లిని ఒప్పించి మళ్లీ సినిమాల్లోకి వచ్చానని తెలియజేసింది.
ఈ ముద్దుగుమ్మ తెలుగు, కన్నడ, మలయాళం, తోపాటు ఇతర భాషలు మాట్లాడడం వస్తుందట. తమ సంస్థ నుంచి అత్యాచారాలకు గురైన మహిళలకు అండగా ఉండడమే కాకుండా,గృహహింస కేసులలో మహిళల తరఫున కోర్టులో పోరాటం వంటివి చేస్తూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక తమ సంస్థ ద్వారా మానసికంగా ఆందోళన చెందుతున్న వ్యక్తులకు సహాయం అందిస్తున్నట్లుగా కూడా తెలియజేసింది. తాజాగా యశోద సినిమాలో ప్రియతమైన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్.