డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.హీరోయిన్ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్యతో ఒక సినిమాలో నటించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తన మకాన్ని మార్చేసింది. అలా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే ఉంటూ అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న సమయంలో తన తల్లి తనకు వార్నింగ్ ఇచ్చిందనే విషయాన్ని తెలియజేసింది. అయితే హీరోయిన్ గా ఎదగాలి అంటే కచ్చితంగా గ్లామర్ షో చేయడం అవసరం ఇలా అన్ని కప్పుకొని కూర్చొని ఉంటే హీరోయిన్గా అవకాశాలు రావని తెలియజేసిందట. అయితే తాను వాటన్నిటికీ దూరంగా ఉండాలని తన తల్లి గ్లామర్ విషయంలో తనకు వార్నింగ్ ఇచ్చిందని తెలియజేసింది కృతి సనన్. ఈ విధంగా సినిమాలలోకి రాకముందు తన తల్లి తనకు అలాంటి వార్నింగ్ ఇచ్చింది అనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలియజేసింది.
అయితే తన తల్లి వార్నింగ్ ఇచ్చిన పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలి అంటే కచ్చితంగా గ్లామర్ షో తప్పనిసరి అని అందుచేతనే తన తల్లి మాట కూడా లెక్క చేయలేదని తెలియజేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తే బిజీగా ఉంది కృతి సనన్.