పుష్ప 2లో ఆ స్టార్ హీరోయిన్ నటించబోతుందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ డిసిషన్..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ‌డంతో ఇప్పుడు.. ఆ సినిమా సీక్వెల్ పైన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సుకుమార్ రీసెంట్గా మొదలుపెట్టాడు. సుకుమార్ కూడా ఈ సినిమాను తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌క్కెక్కంచాల‌ని ప్లాన్‌ చేస్తున్నాడు.

Catherine Tresa Net Worth, Age, Height and More - News

ఇక ఇప్పుడు వచ్చే పుష్ప పార్ట్ 2 లో మోద‌టి బాగంలో ఉన్న పాత్రల కన్నా కొన్ని కొత్త పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తుంది. వాటిలో ఒక కీలక పాత్ర గురించి ఒక వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఆ పాత్రలో కేథరీన్ థెరీసా నటించబోతుందని తెలుస్తుంది. పుష్ప2లో ‘కేథరీన్ థెరీసా’ ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. ఇక ఈమెతో పాటు మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఉంటుంది అని తెలుస్తుంది.

Manoj Bajpayee rejects reports of him playing a cop in Pushpa 2: 'Kahan  kahan se…' | Entertainment News,The Indian Express

ఇక ఆ పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక బన్నీ పుష్ప2 సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాతో బన్నీ తన ఇమేజ్‌ను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Share post:

Latest