కియారా అద్వానీ.. బీటౌన్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా `భరత్ అనే నేను` సినిమాలో నటించి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా `వినయ విధేయ రామ` లో కియారా అవకాశాన్ని అందుకుంది.
కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్ వైపు చూడని కియారా.. బాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంటూ అక్కడ అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. పైగా ఈమె నటించిన ప్రతి సినిమా మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా ముద్ర వేయించుకుంది.
ఇక చాలా కాలం తర్వాత కియారా తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే `ఆర్సీ 15`. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే కియారా తాజా ఫోటోషూట్ నెట్టింట దుమారం రేపుతోంది.
టైట్ బ్లాక్ ప్యాంట్, మినీ టాప్ లో ఉప్పొంగే ఎద అందాలు ఓవైపు, నాజూకు నడుము సోకులు మరోవైపు చూపిస్తూ యమా హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే ఈ పిక్స్ లో కియారా కసి చూపులు మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. కియారా అందాల అరాచానికి ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. అంత హాట్‌గా ఆమె దర్శనం ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం కియారా లేటెస్ట్ లుక్స్ పై మీరు లుక్కేసేయండి.