అదే జ‌రిగితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమార‌న్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌లార్ సినిమా తెర‌కెక్కుతోంది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నెట్టింట‌ మారింది. అదేంటంటే ఈ చిత్రం వచ్చే ఏడాదే విడుదల కాబోతోంద‌ట‌.

ఇప్ప‌టికే మేకర్స్ రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేశారట. ప్రశాంత్ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే `స‌లార్‌` ను వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా అంటున్నారు. ఏది నిజమో తెలియదు కానీ సలార్ ఒకవేళ వచ్చే ఏడాదే విడుదల అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండ‌గే పండ‌గ‌.