హీరోయిన్ శ్రీదేవి గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాను దొరికితే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని తెలియజేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోల సరసన నటించమని తనని ఎవరూ కూడా ఇప్పటివరకు సంప్రదించలేదని అలాగే తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా నటిస్తానని తెలియజేస్తోంది.
జాన్వీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఎక్కువ సమయం పట్టవచ్చు అని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొరటాల శివ ఇప్పటికే జాన్వీ కి గాలం వేసి లాగుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ,డైరెక్టర్ చిట్టిబాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రనికీ ఈమెనే హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ సరసన జాన్వీ ని ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ అవేవీ నిజం కాలేకపోయాయి.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ సరసన జాన్వీ ఎంపిక సరైనది కాదని కోంత మంది అభిమానులు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం ఇదే సరైన సమయం అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికీ చాలా మారిపోయింది ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటోంది. మరి ఈ వార్తలపై ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.