`హిట్ 2` హిట్ అవ్వాలంటే ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్ట‌ర్ శైలేష్ కొలను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `హిట్‌` సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే `హిట్‌`కు సీక్వెల్‌గా `హిట్ 2` రాబోతోంది. ఇటీవల `మేజర్` సినిమాతో బంపర్ హిట్ అందుకున్న‌ అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించాడు.

ఇందులో మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా న‌టిస్తే.. కోమలి ప్రసాద్‌, రావు రమేష్‌ కీలకపాత్రల‌ను పోషించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

హిట్ మంచి విజ‌యం సాధించ‌డం, అడివి శేష్‌కు ఉన్న క్రేజ్‌, నాని స‌పోర్ట్‌, మేక‌ర్స్ చేసిన ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా ఈ చిత్రానికి భారీగానే బిజినెస్ జ‌రిగింది. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి – రూ. 10.25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌ర‌గ‌గా.. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ – రూ. 2.50 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జ‌రిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టోట‌ల్‌ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 14.25 కోట్లు జ‌రిగింది. అంటే `హిట్ 2` సినిమా హిట్ అవ్వాలంటే రూ. 15 కోట్లు రాబట్టాలి. మ‌రి ఈ టార్గెట్ ను అడివి శేష్ అందుకుంటాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.