ఒక్కవేళ ఆ సినిమా హిట్ అయితే.. గట్టిగా అరిచి బిల్డింగ్ నుండి దూకేస్తా.. ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్ ..!!

రాంగోపాల్ వర్మ.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసి ప్రస్తుతం వివాదాల డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పట్లో యంగ్ హీరోలను తన సినిమాలతో స్టార్ హీరోలుగా తీర్చిన రాంగోపాల్ వర్మ గ‌త‌ కొన్ని రోజులుగా ప్రతి విషయానికి కాంట్రవర్సీని జోడించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు.అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ సినిమాలకు డైరెక్షన్ చేస్తూ కాంట్రవర్సీ డైరెక్టర్ గా నిలిచిపోయారు.

అంతేకాకుండా ఈయన సినీ కెరియర్ విషయంలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. దాంతో నిత్యం ఈయన వార్తల్లో నిలుస్తూ అలాగే నెటిజెన్ల నుండి ట్రోలింగ్స్ కు గురవుతున్నారు. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు.

అయితే గతంలో రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాంగోపాల్ వర్మకు.. ఒకవేళ మీ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మీరు ఏం చేస్తారని? యాంకర్ ప్రశ్నించగా… ఆ ప్రశ్నకు వర్మ స్పందిస్తూ.. “నేను చాలా గట్టిగా ఏడ్చి బిల్డింగ్ మీద నుండి దూకేస్తాను“ అంటూ యాంకర్ మరియు ప్రేక్షకులు షాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడు. అలా వర్మ ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి బోల్డ్ ప్రశ్నలు వచ్చిన ఏమాత్రం తగ్గకుండా చాలా ఓపెన్ ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్జీవి గతంలో చేసిన సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest