బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఇది వింటే ఎగిరి గంతేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైస్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` పేరిట పార్ట్ 2 రాబోతోంది. బన్నీ ఇప్పుడు పుష్ప 2 పైనే ఫోకస్ పెట్టాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బన్నీ ఫాన్స్ ఎగరి గంతేసే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే `పుష్ప 2` ఫస్ట్ గ్లింప్స్ ను బయటకు వదిలేందుకు మేకర్స్‌ డేట్ లాక్ చేశారట.

pushpa 2 updates
pushpa 2 updates

ఈ డిసెంబర్ 17 నాటికి పుష్ప పార్ట్ 1 విడుదలై ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు పుష్పా 2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయాలని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవడం ఖాయం.

Share post:

Latest