గాలోడు సినిమా కోసం సుధీర్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు. వారి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడు. తనకి సినిమా అవకాశాలు రావడంతో ఆ షో నుంచి బయటకి వచ్చేసాడు. ఆపై సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ సుధీర్ ఏ ప్రోగ్రామ్, సినిమాకి తీసుకోనంత రెమ్యునరేషన్ ‘గాలోడు’ సినిమాకి తీసుకున్నాడట.

ప్రస్తుతం ‘గాలోడు’ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. సుధీర్ నటించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ సినిమాల్లో సుధీర్ నటన విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. స్టోరీ ఎలా ఉందనేది పక్కన పెడితే అతడి నటనతో అతనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. దాంతో లేటెస్ట్‌గా సుధీర్ నటించిన గాలోడు సినిమా కోసం అతని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు సుధీర్ ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ‘గాలోడు’ సినిమా తీశారట. ఈ సినిమా కోసం సుధీర్ చాలాకష్ట పడ్డాడట. దానికి తగ్గట్టుగా రూ.50 నుంచి 60 లక్షల పారితోషికం తీసుకున్నాడట.. ఇటీవలే జరిగిన కొన్ని ఇంటర్వ్యూలలో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సుధీర్ తెలిపారు. ఒక పల్లెటూరి కుర్రాడు గాలోడిలా మారిన తరువాత ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. అక్కడ అతను ఫేస్ చేసిన ఇబ్బందులను ఈ సినిమాలో సుధీర్ యాక్షన్‌తో మంచిగా చూపించాడని తన అభిమానులు అంటున్నారు.

జబర్దస్త్ షో నుంచి బయటికోచ్చేసాక సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించబోతున్నాడు. బుల్లితెరపై సుధీర్ నటన చూసి ప్రేక్షకులతో పాటు తోటి ఆర్టిస్టులు కూడా ఫిదా అయ్యేవారు. అలాంటి వారందరూ వెండితెరపై సుధీర్‌ని చూసి ఎంతగానో మురిసిపోతారేమో. గాలోడు సినిమాలో సుధీర్ సరసన గేహ్న సిప్పి నటిస్తుంది. ప్రకృతి సమర్పణలో రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

 

Share post:

Latest