నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరిచిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో ఒక మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.ఆ చిత్రమే వీరసింహారెడ్డి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నది.
ఈ చిత్రం వచ్చేయేడది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ సినిమాకి పోటీగా వాల్తేరు వీరయ్య,విజయ్ నటిస్తున్న వారసుడు, అజిత్ తునీవు తదితర చిత్రాలు విడుదల కాబోతున్నాయి దీంతో చాలావరకు తెలుగు సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాకి ప్రధానంగా థియేటర్లో సమస్య తలెత్తబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెలరోజుల ముందు నుంచి దిల్ రాజు తాను డబ్బింగ్ చేస్తున్న సినిమాల కోసం థియేటర్లన్నీ కబ్జా చేసుకుంటూ వెళ్లారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఇక అంతే కాకుండా అందుకు సంబంధించి ఎగ్జిబిటర్లతో ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో మెయిన్ థియేటర్లు చాలా వరకు బాలకృష్ణ సినిమాకి లభించడం లేదని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాకుండా వాటికోసం మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ఫైట్ చేస్తున్న ఫలితం దక్కలేదని సమాచారం. మరి ఈ నేపథ్యంలో బాలయ్య ఎలా రియాక్షన్ అవుతారు తెలియాల్సి ఉంది. ఇక గతంలో కూడా టాలీవుడ్ షూటింగ్లో బంద్ నేపథ్యంలో బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ నీ మేకర్స్ నిలిపివేయడం జరిగింది. అయితే బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఆపకూడదని తిరిగి మొదలు పెట్టాలని తెలియజేసినట్లు సమాచారం. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి బాలయ్య.