భారతీయ హిందూ సంప్రదాయంలో కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించాలి. వాటిలో ప్రధానంగా ఏ కుటుంబంలోనైనా ఎవరైనా మరణించినప్పుడు వారికి కర్మకాండలు చేసినప్పుడు తలనీలాలు కచ్చితంగా ఇవ్వాలి. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉంటే తండ్రికి పెద్ద కొడుకు కర్మకాండ నిర్వహించాలి, తల్లికి చిన్న కొడుకు చేయాలి.. వారికి ఒక కుమారుడే ఉంటే ఇద్దరికీ అతనే కర్మకాండ చేస్తాడు.
ఈ ప్రస్తావన చేయడానికి గల ముఖ్య కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో కర్మ క్యాండలను తానే దగ్గరుండి సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. కర్మకాండలో ముఖ్య భాగమైన తన తలనీలాలు మాత్రం తీయలేదు. కృష్ణకు ఇద్దరు కుమారులు ఉన్నరు అయితే ఈ సంవత్సరం జనవరిలో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. ఇక దీంతో మహేష్ బాబు వారి తల్లిదండ్రులు ఇద్దరికీ కర్మకాండ నిర్వహించాడు.
ఈ నెల 15న కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఇక నిన్న వారి పెద్దకర్మ మహేష్ నిర్వహించాడు. అయితే మహేష్ తన తల్లిదండ్రులకు కర్మకాండ చేసినప్పుడు రెండు సందర్భాల్లో కూడా తన తల వెంట్రుకలను తీయలేదు. దీనికి కారణం ఏమిటని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు నటించబోయే సినిమాలని తెలుస్తుంది. మహేష్ బాబు తన జుట్టు తీస్తే మళ్లీ పూర్తి స్థాయిలో రావడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది.
ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరో ముఖ్యమైన కారణం మహేష్ జుట్టు పూర్తిస్థాయిలో ఒరిజినల్ జుట్టు కాదు. తన జుట్టుకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఇక దీని కారణంగా ఆయన జుట్టు తీయడం సరైన నిర్ణయం కాదని ఆయన జుట్టు తీస్తే ఆయన లుక్ పై విమర్శలు వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తుంది.