నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు.
ఇకపోతే అతని సంతానానికి వారి సంతానానికి అప్పట్లో ఆయనే పేర్లు పెట్టేవారట. అందుకే అవి అంత ప్రత్యేకంగా వుంటాయని ఆయన సన్నిహితులు చెప్పుకుంటూ వుంటారు. ఎన్టీఆర్ తెలుగులో కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. ఆ తరువాత సినిమాల నుండి రాజకీయాలవైపు వెళ్లి తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి CM అయ్యారు. జనాలకి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు. అప్పటివరకు తెలుగు వాళ్ళని చులకనగా చూసే ఉత్తర భారతదేశం ప్రజలంతా ఎన్టీఆర్ అధికారంలోకి రావడంతో తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి తెలుసుకున్నారు.
అలాంటి ఎన్టీఆర్ కి భక్తి భావం ఎక్కువగా ఉంటుంది అలాగే తెలుగు భాష మీద మంచి గ్రిప్ ఉంది. అందుకే వాళ్ల కొడుకులకి కానీ, కూతుళ్ళకి కానీ మనవాళ్లకు గాని, మనవరాళ్ల గాని మంచి మంచి పేర్లని సెలెక్ట్ చేసి పెట్టారని చెబుతూ వుంటారు. కొకుకులకు జయ కృష్ణ, హరి కృష్ణ, రామకృష్ణ, మోహన కృష్ణ, బాలకృష్ణ, జయశంకర్ కృష్ణ, సాయి కృష్ణ. కూతురు పేర్ల విషయానికొస్తే పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి అని పెట్లు పెట్టారు. అలాగే వాళ్ల పిల్లలకు కూడా అటువంటి పేర్లే సెలెక్ట్ చేశారట మహానుభావులు.