సాధారణంగా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులను అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకొని దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా తమ హీరోల అంటూ అభిమానులు కూడా తెగ ఉపయోగించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నటీనటులు సైతం తినే ఆహారంలో కొన్ని అలవాట్లు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటుల సైతం బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ లేవు.. ముఖ్యంగా కృష్ణ గారు వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. అవేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారపు అలవాట్లలో కృష్ణ గారి తీరే చాలా సపరేటుగా ఉంటుందని చెప్పవచ్చు. కృష్ణ గారితో సినిమాలు తెరకెక్కించిన కొంతమంది రచయితలు కోఆర్టిస్టులు చాలామంది చెబుతున్న ప్రకారం.. గూడచారి 117 వంటి సినిమాలు పనిచేసిన రచయిత తోటపల్లి మధు కృష్ణ గారి ఫుడ్ హ్యాబిట్ విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ రచయిత మాట్లాడుతూ కృష్ణ గారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో చాలా సింపుల్ గా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా ఆయన మాట్లాడే ప్రతి మాటలకు కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తాయని తెలిపారు.
ఉదయం ఇంటి నుంచి బయలుదేరి టిఫిన్ వంటివి పూర్తి చేసుకుని వస్తారని.. మళ్ళీ 11 గంటలకు మాత్రం కేవలం పెరుగు, వడ మాత్రమే తినేవారు. ఇక ఒంటిగంటకు భోజనం సమయంలో కాస్త భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నిద్రపోయి మళ్లీ లేచే వారిని తెలిపారు. అలా కొద్దిసేపు అయిన తర్వాత సున్నుండలు తినేవారట. ఇక సాయంత్రం ఐదు గంటలకు గోధుమ రవ్వతో వేసిన దోసెను మనీ హోటల్ నుంచి తెప్పించేవారని తెలిపారు. ఇది మద్రాస్ స్టైల్ అని ప్రొడ్యూసర్ తెలిపేవారు. కృష్ణ ఆహారానికి చాలా ప్రాధాన్యత ఇలా ఉండేది అని తెలిపారు.ఇవన్నీ ప్రతి సినిమా షూటింగ్లో కచ్చితంగా ఉండాల్సిన వేనట.