యాంకర్ సుమ ఇంట్లో ఎన్ని సినిమా షూటింగులు జరిగాయో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ ఎన్నో షోలకు, ఈవెంట్లకు హొస్టుగా వ్యవహరించింది. సుమ ఈ మధ్య కాలంలో సినిమాలలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రేంజ్ లో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అలా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాలో నటిగా రీ యంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

యాంకర్ సుమ గారి ఇల్లు ఎప్పుడైనా చూసారా. ఆ ఇంట్లో ఈ 5 సినిమాలు షూటింగ్  జరిగాయని తెలుసా. - five telugu movie shootings in anchor suma house -
కానీ సుమ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే సుమ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నో సినిమాలు సుమ ఇంట్లోనే షూటింగ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఏ ఏ సినిమాలో సుమ ఇంట్లో సందడి చేశాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగచైతన్య, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 100% లవ్ సినిమా షూటింగ్ ఎక్కువగా సుమ ఇంట్లోనే జరిగిందట. ఇక ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన బాద్ షా సినిమా కాజల్ అగర్వాల్ ఇల్లు సుమ ఇల్లేనట.

Did you know how many movies have been shot in Anchor Suma's house? -  Telugu Rajyam
ఇక దూకుడులో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఒక ఇంట్లో ఉంటారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలానే చిత్రీకరించారట. ఇక రాంచరణ్ నటించిన బ్రూస్ లీ, సునీల్ నటించిన పూలరంగడు సినిమాలోని ఇల్లు కూడా సుమ దే కావడం గమనార్హం. ఇలా ఎన్నో సినిమాలు సుమ ఇంట్లోనే షూటింగ్ జరిగాయి. అయితే ఇందుకు గల కారణం సుమ ఇల్లు చాలా అందంగా కనిపించి సినిమా షూటింగ్ కు చాలా అనుగుణంగా ఉంటుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Share post:

Latest