“పుష్ప2”వచ్చేది అప్పుడేనా.. సుకుమార్ మరీ ఇంత టైమ్‌ తీసుకుంటున్నాడా.!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప‌ ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలై పాన్‌ ఇండియా లెవ‌ల్‌ సూపర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న పుష్ప టీమ్‌ అంతకుమించిన ఉత్సాహంతో పుష్ప ది రూల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ తన కెరియర్ లోని బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం మరింత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2023లో కాకుండా 2024 మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది.. ఫాహద్ ఫజిల్, అజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్ వంటి అగ్ర న‌టులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

Share post:

Latest