టాలీవుడ్ సీనియర్ నటులలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ మొన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక నిన్న మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అభిమానుల సమక్షంలో మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృష్ణను మనం రోజు రాస్తున్న చూస్తున్న ఆయనకు సంబంధించిన భార్యల గురించి మనకు తెలుసు.
కానీ ఆయన బ్యాచిలర్ లైఫ్ లో పెళ్లికాకముందు కృష్ణ తమ్ముళ్లు, తల్లిదండ్రులతో ఉన్న విషయాలు పెద్దగా ఎవరికి తెలియదు. వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించవు. ఆయన పూర్తి కుటుంబంతో కలిసి ఉన్న ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కృష్ణ ఆయన తల్లిదండ్రులు వీర రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ ఆయన తమ్ముళ్లు అది శేష గిరి రావు, హనుమంతరావు కలిసి ఉంటారు.
ఆ ఫోటోలో తమ్ముళ్లతో పాటు కృష్ణకు ఇద్దరు అక్కలు కూడాా ఉన్నారు. కృష్ణ తమ్ముళ్లు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వారే. కృష్ణ సినిమాల్లోకి వచ్చి ఇక్కడ స్టార్ హీరో అయ్యాక తమ్ముళ్ళను పిలిపించుకొని వారిని కూడా ఆయనతోనే ఉంచుకున్నారు. వారితో పద్మాలయ స్టూడియోస్ నిర్మించి ఆగ్ర నిర్మాతులగా నిలబెట్టారు. కృష్ణ వారి తమ్ముళ్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తమ్ముళ్లకు వారి అన్న అంటే ఎంతో ప్రేమ ఆయన ఏది చెప్పినా కాదనకుండా చేసే వారు. ఇప్పటివరకు కృష్ణకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు దగ్గరుండి చూసుకున్నారు. ఆయన చివరి దశ కార్యక్రమాలు కూడా ఆయనే ఎంతో బాధ్యతగా నిర్వహించారు.