మైదుకూరులో పుట్టాకు షాక్..డీఎల్ ఎంట్రీ?

ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. జగన్‌ని ఓడించడానికి పవన్‌తో కలవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ సారి అన్నీ జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్టాలనే విధంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా పైచేయి సాధించాలని చూస్తున్నారు.

గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది..అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది..దాదాపు సగం నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజంపేట, రైల్వే కోడూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి సీట్లలో వైసీపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఈ సారి ఖచ్చితంగా ఈ సీట్లని గెలిచి తీరాలని చూస్తున్నారు. అయితే బలమైన నాయకులని నిలబెట్టి ఈ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు.

ఇదే క్రమంలో మైదుకూరు సీటుపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక్కడ ఇంచార్జ్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు…గత రెండు ఎన్నికల్లో ఈయనే పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో కూడా మైదుకూరులో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే వైసీపీపై ఉన్న వ్యతిరేకతని పుట్టా ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవాలి. కానీ ఆ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.

పైగా ఈ సీటుని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆశిస్తున్నారు. పలుమార్లు కాంగ్రెస్ నుంచి డీఎల్ మైదుకూరులో గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేశారు. కానీ అక్కడ ప్రాధాన్యత లేదు..దీంతో టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని చూస్తున్నారు. కాకపోతే సీటు విషయంలో క్లారిటీ లేదు. ఇదే క్రమంలో మైదుకూరులో టి‌డి‌పి అంతర్గత సర్వే నిర్వహించగా, మెజారిటీ డీఎల్ వైపే మొగ్గు చూపారట దీంతో మైదుకూరు సీటు పుట్టా కంటే డీఎల్ ‌కు ఇవ్వడం బెటర్ అని భావిస్తున్నారట. మరి చూడాలి మైదుకూరు విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Share post:

Latest