రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!

యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస‌ సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

Ram Pothineni Teams Up With Director Boyapati Sreenu for His 20th Film!  (View Pic) | 🎥 LatestLY

ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ చేయని స్టోరీ తో బోయపాటికి కలిసి వచ్చిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి శ్రీనుకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు బాగా కలిసి వచ్చాయి.. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ తరహా సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే కథను రెడీ చేసి రామ్ కి సూపర్ హిట్ ఇవ్వాలని బోయపాటి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Boyapati Srinu: Will Boyapati bring Bollywood beauty to the boy hero ..?  Who is that seller .. | Boyapati srinu ram pothineni movie latest update –  filmyzoo – Hindisip

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో రామ్ కు జంటగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. థ‌మన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో రామ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Share post:

Latest