టాలీవుడ్ లో హీరోయిన్ పూర్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా పలు సినిమాలలో నటించడమే కాకుండా అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలోనే నటిస్తూ ఉంటుంది పూర్ణ. ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమె సంతోషంతో చాలా గ్లామర్ మరింత పెరిగిపోయింది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పట్టు చీరలో పూర్ణ రాయల్ లుక్ మెస్మరైజింగ్ చేసేలా కనిపిస్తోంది.
అందం అసూయ పడేలా పూర్ణ ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.ఒక్క సారిగా నాకు వివాహమైందని చెప్పి పూర్ణ షాక్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పూర్ణ దుబాయ్ కి చెందిన ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని మాత్రమే తెలియజేసింది.ఆ తర్వాత పెళ్లి విషయాన్ని మాత్రం చాలా రహస్యంగా ఉంచింది.. మే నెలలో నిశ్చితార్థం జరగగా జూన్లో వివాహం జరిగిందని ఇటీవల ఆమె తెలియజేసింది. కొన్ని కారణాల వలన వివాహానికి ఎవరిని పిలవలేదని కేవలం దుబాయిలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని తెలిపింది పూర్ణ.
త్వరలోనే కేరళలో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేసింది. ఇక పూర్ణ భర్త పేరు షానిద్ ఆసిఫ్ అలీ. ఈయన దుబాయిలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరని చెప్పవచ్చు. ఇక పూర్ణ కు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చారు తన భర్త.
పూర్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుల్లి తెరపై ఢీ లాంటి షోలు రీయంట్రి ఇవ్వడం జరిగింది. మళ్లీ జడ్జిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అటు తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం పూర్ణకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
https://twitter.com/FilmyTheory/status/1593124341029695493?s=20&t=Jb_lJI83Jh83b2P3KZ1h1w