బాలీవుడ్ లో కొత్తజంట ప్రేమ కహానీ పిచ్చెక్కిస్తోంది!

బాలీవుడ్ బాగోతాలు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త ప్రేమ జంట బలాదూర్ తిరుగుతోంది. దాంతో ఈ జంట గురించి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో విధంగా హల్ చెల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా కొత్తజంట అని అనుకుంటున్నారు కదూ. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు పష్మినా రోషన్. కార్తీక్ ఆర్యన్ తెలుసుగాని, పష్మినా రోషన్ మాకు తెలియదంటారా? అదేనండి మన బాలీవుడ్ కండల వీరుడు, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కజిన్ రాజేష్ రోషన్ కుమార్తె ఈ పష్మినా రోషన్.

కాగా ఈమె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. ఇటువంటి పరిస్థితిలో వీరు పట్టుబడటం ఒకింత విడ్డురమే మరి. ఇంకా తెరంగేట్రం చేయక ముందే అమ్మడు కార్తీక్ ఆర్యన్ చేయి పట్టుకొని కనబడుతోంది. ఇంకా సినిమాలు చేస్తే ఇంకేమైనా వుందా అని అనుకుంటున్నారా? నిజమే. బాలీవుడ్ ఈవెంట్స్ లో ఎక్కడ చూసినా వీరిద్దరు కలిసి కట్టుగా ఉంటున్నారు. అంతేకాదు దీవాళి నైట్ కూడా కార్తీక్ పష్మినా కలిసి రాత్రంగా ఉన్నారట. వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెడ్ షిప్పే అంటూ కొందరు గట్టిగా చెబుతున్నా వీళ్ల వ్యవహారం చూస్తే ఫ్రెండ్ షిప్ రేంజ్ దాటి సంథింగ్ సంథింగ్ అనిపించేస్తున్నారు.

ఇకపోతే కార్తీక్ ఆర్యన్ ఇదివరకు సారా అలి ఖాన్, అనన్యా పాండేలతో కూడా రిలేషన్ ఉన్నాడంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసినదే. అయితే అవి కేవలం గాలి వార్తలని అర్ధం అవుతోంది. అందుకే కార్తీక్ ఇప్పుడు పష్మినాకి క్లోజ్ గా ఉంటున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే పష్మినా రోషన్ వార్తల్లో నిలవడం చూస్తే అమ్మడు బాలీవుడ్ ని బాగా చదివేసింది అంటూ నెటిజన్లు గుసగుసలాడుకున్తున్నారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న కథానాయిక కాబట్టి తెరంగేట్రం గ్రాండ్ గానే ఉండబోతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Share post:

Latest