బాలకృష్ణ ను ఢీ కొట్టబోతున్న షారుక్ ఖాన్ విల‌న్‌.. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్..!!

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యతో సరైన కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని నిరూపించాడు. ఇదే క్రమంలో కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వస్తారా రారా అని భయపడుతున్న చిత్ర పరిశ్రమకు తన అఖండ సినిమా విడుదల చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేలా చేసి.. విడుదలకు వాయిదా పడుతున్న ఇతర సినిమాలకు సరైన కథతో వస్తే ప్రేక్షకులు ధియేటర్ కు వస్తారని నిరూపించాడు బాలకృష్ణ.. అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా తన సేవా కార్యక్రమాలతో.. ఇక రీసెంట్ గా స్టార్ట్ అయిన ఆన్ స్టాఫ్‌బుల్ సీజన్2 టాక్ షో తో యువ హీరాలకు పోటీగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.

అఖండ సినిమా త‌ర్వాత యంగ్ డైరెక్టర్స్‌ తో వరుస‌ క్రేజీ సినిమాలలో లైన్లో పెట్టిన బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా అయిన వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా షూటింగును డిసెంబర్ మధ్యలో ముగించాలని ప్లాన్ చేసుకున్నారు.. ఆ తర్వాత తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ ద‌క్శ‌కుడు అనీల్ రావిపూడి తో చేబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ని కూడా చిత్ర యూనిట్ ఫుల్ స్వింగ్‌లో కంప్లీట్ చేస్తుంది.

ఈ సినిమాను వీలైనంత తొందరగా నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలకృష్ణను నెవర్ బిఫోర్ ఎవర్‌ ఆఫ్టర్ అనే విధంగా ఎవరు ఊహించని రీతిలో చూపించబోతున్నాడని టాక్.. బాలయ్య ఈ సినిమాలో ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలిసింది ఇందులో ఈయనకి కూతురుగా పెళ్లి సందడి ఫ్రేమ్‌ శ్రీ లీల నటించబోతుంది. ఈ సినిమాలో విలన్ గా ఓ బాలీవుడ్ బడా హీరో నటించబోతున్నారని గత కొద్దిరోజులుగా ఓ వార్త వైరల్ గా మారింది.

తాజా సమాచారం ఏమిటంటే బాలకృష్ణ 108వ సినిమాలో ప్రముఖ హిందీ కథానాయకుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రకు ఫిక్స్ అయ్యారట.. దీనికి సంబంధించిన విషయాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది. అర్జున్ రాంపాల్ హీరో గానే కాకుండా షారుక్ ఖాన్ ‘రా.వన్’, ‘ఓం శాంతి ఓం’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక అలాంటి స్టార్ హీరో ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

Share post:

Latest