బాలయ్య అన్ స్టాపబుల్ షో కి… ఎవరు ఊహించని అతిథి రాబోతున్నాడా..!!

ఇండియాలో ప్రసారమవుతున్నటాక్ షోల అన్నిటిలో మాస్ కా బాప్ ఏది అంటే నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అని అవుట్ అండ్ అవుట్ గా చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్నఈ షో ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తొలి సీజన్ లో తోలి సారిగా వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఆ సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. రీసెంట్గా దానికి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ కూడా అంతకుమించిన ఎనర్జీతో బాలకృష్ణ ముందుకు తీసుకు వెళ్తున్నారు.

Balakrishna Unstoppable Season 2 : బాలయ్య అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ 4 ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇదుగో.. - balakrishna unstoppable season2 4th episode , balakrishna , unstoppable season 2 ...

ఈ సీజన్ తొలి గెస్ట్ లుగా బాలకృష్ణ బావమరిదైన చంద్రబాబు, బాలయ్య అల్లుడైన లోకేష్ హాజరయ్యారు.. ఈ షో ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. తర్వాత రెండు ఎపిసోడ్లకు గాను యువ హీరోలు హాజరైన విషయం మనకు తెలిసిందే.. అవి కూడా ఎంత గ్రాండ్ సక్సెస్ అయి.. అదిరిపోయే వ్యూస్‌తో దుసుకుపోతున్నాయి.

ఇప్పుడు రాబోయే నాలుగో ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే మరో రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ షో కి గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. బాలకృష్ణకు కిరణ్ కుమార్ రెడ్డి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటినుంచి వీరిద్దరూ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డి ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా.. ఎలా ఆటపాటిస్తారు అన్నది.. తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్టీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే..!!

Share post:

Latest