బాలయ్య కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ ఓవైపు వరుస‌ సినిమాలతో మారో వైపు బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖండ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రీసెంట్గా వీర సింహ రెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగాకి శృతిహాసన్ నటిస్తుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ ఆహాలు అన్‏స్టాపబుల్ టాక్ షోతో తన డైలాగులతో తన పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాల తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడుగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారట. మరి ఆ బాలీవుడ్ నటుడు మరెవరో కాదు ఆశ్రమం వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న బాబీ దేఓల్ ఇప్పటికే దర్శకుడు కూడా అతనితో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా చెప్పి ఒప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ కూడా అంగీకరించినట్లుగా సమాచారం.

Balakrishna: బాలయ్య సినిమాలో మరో బాలీవుడ్ స్టార్.. పవర్‏ఫుల్ విలన్‏గా ఎవరంటే.. | TV9 Telugu

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా అనిల్ రావిపూడి ఎప్పుడో కంప్లీట్ చేశాడు… సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చాయట. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని తెలుస్తుంది.

Share post:

Latest