ఎన్టీఆర్ 30 సినిమా నుండి.. అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమాపై అందరిలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో రెండో సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి ముందు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక‌ కొరటాల తను చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన ఫామ్ ని కోల్పోయాడు.

ఎన్టీఆర్ కొరటాల మీద నమ్మకంతో తన 30వ సినిమాను చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇది వీరిద్దరి కాంబోలో రెండవ సినిమా అవ్వడంతో సినిమాపై భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చి చాలా రోజులైనా ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ సినిమా షూటింగ్ అసలు మొదలు పెడతారా లేదా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా దర్శకుడు కొరటాల అలాగే రత్నమేలు మరియు సాబు సిరిల్ కలిసి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తానికైతే ఎన్టీఆర్ అభిమానులకి ఇది పెద్ద ఆనందం కలిగించే వార్త నీ చెప్పవచ్చు.

Share post:

Latest