ఈ ఒక్క మాట‌తో వైసీపీ బెంబేలెత్త‌తోందా.. ఆ మాట ఇదే…!

గ్రామీణ స్థాయిలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అర్బ‌న్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదిక‌లు అందాయని తెలిసింది. ప్ర‌స్తుతం పార్టీ త‌రఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర మాలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్న‌నాయ‌కులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం స‌ర్వే నివేదిక‌లు సేక‌రించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛ‌న్ అందుతుండ‌డంపై ప్ర‌జ‌లు ఆనందం గానే ఉన్నారు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ క‌నిపిస్తోంది.

అయితే.. అది ఒక్క పింఛ‌న్ల విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇదే.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫీడ్ బ్యాక్ అయితే.. మ‌రి ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల మాటేంటి? వాటిని తీసుకుంటున్న‌వారి భావాలు ఎలా ఉ న్నాయి.. అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఒకింత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని తాజాగా నివేదిక అందిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అర్బ‌న్‌(ప‌ట్ట‌ణ‌) ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా అభివృద్ధి కోరుకుంటున్నారు. ముఖ్యంగా ర‌హ‌దారులు.. రాజ‌ధాని అంశాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు.

ఈ రెండు విష‌యాల్లోనూ.. వైసీపీ స‌ర్కారు ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది. ర‌హ‌దారులు నిర్మిస్తున్నా మ‌ని.. వ‌చ్చే వ‌ర్షాకాలానికి ముందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారులు అద్దంగా మెరుస్తాయ‌ని.. జ‌గ‌న్ చెప్పా రు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మడి 10 జిల్లాల్లో రోడ్లు అస్తవ్య‌స్తంగానే ఉన్నాయి. దీనిపై ఉద్యోగులు.. కార్మికులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు కూడా సీరియ‌స్‌గానే ఉన్నాయి. అదేస‌మ‌యంలో మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపైనా.. ప్ర‌జ‌ల్లో స్పంద‌న క‌నిపించ‌డం లేదు.

ఈ ఎఫెక్ట్ అర్బ‌న్ ప్రాంతాల్లో క‌నిపిస్తుండ‌డం.. వైసీపీకి సానుకూలంగా లేద‌నే వాద‌న‌.. ఇప్పుడు పార్టీ అధిష్టానానికి చేరింది. ఈ క్ర‌మంలో ఏదైనా తేడా కొడితే.. ఎంత మేర‌కు ఓటు బ్యాంకుపై ప్ర‌భావం చూపుతుంద‌నే లెక్క‌లు బ‌య‌ట‌కు తీసుకున్నారు. అర్బ‌న్‌లో 25 శాతం ఓటు బ్యాంకు ఉంది. వీటిలో 5-10 శాతం..టీడీపీ అనుకూల ఓటు బ్యాంకు ఉంది. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఓటు.. టీడీపీకే వెళ్లిపోతోంది.

మిగిలిన 15 శాతంలో గ‌త ఎన్నిక‌ల్లో 4 శాతం జ‌న‌సేన‌కు ప‌డ‌గా.. మిగిలిన దానిలో 11 శాతం వైసీపీకి చేరింది. సో.. దీనిని పోగొట్టుకుంటే.. అర్బ‌న్ ప్రాంతాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేలిపోయింది.ఈ క్ర‌మంలో అర్బ‌న్ ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఏం చేయాల‌నే విష‌యంపై అధిష్టానం దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ప‌థ‌కాలు ఇస్తూ.. ప్ర‌చారం చేస్తూ.. పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంతోపాటు.. అవ‌స‌ర‌మైతే.. అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను సైతం ప‌క్క‌న పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.