హిట్ 2 చేయకపోవడానికి కారణం అదే.. గుట్టు విప్పిన విశ్వక్ సేన్!

విశ్వక్ సేన్… కెరీర్ ప్రారంభం నుండి సినిమాల సెలెక్టింగ్ లో తనది ప్రత్యేకమైన రూట్ అంటూ నిరూపించుకుంటున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన `ఓరి దేవుడా` సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో తన యాక్టింగ్ తో కుమ్మేసాడని మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇక అసలు విషయం ఏమిటంటే గతంలో విశ్వసిన్ `హిట్` సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. `ఆ!` అనే సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాచురల్ స్టార్ నాని.. విశ్వక్ సేన్ హీరోగా తరికెక్కిన `హిట్` సినిమాకి కూడా నానినే నిర్మాతగా వ్యవహరించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల ఈ సినిమాకి సీక్వెల్ అయిన `హిట్ 2 `అనే సినిమా త్వరలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాలో యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

అయితే `హిట్` పార్ట్ 1 లో హీరోగా నటించిన విశ్వసిన్ ఈ సినిమాలో ఎందుకు హీరోగా నటించడం లేదు? అన్న ప్రశ్నపై అభిమానుల సైతం షాక్ అయ్యారు. అయితే ఈ విషయం పై స్పందిస్తూ విశ్వక్ సేన్ తాను `హిట్ 2` చేయకపోవడానికి అదే కారణం అంటూ గుట్టు విప్పాడు.అయితే `హిట్ 2` సినిమా కూడా తనతోనే చేద్దామని అనుకున్నారట.. కానీ అతని కాల్ షీట్లు కుదరలేదన్న కారణంతో తనకోసం సినిమా టీమ్ ని ఆగమనడం కరెక్ట్ కాదని ఆయన అనుకున్నారట. అందుకే మరో హీరో అడవి శేషు తో హిట్ 2 సినిమా చేస్తున్నారట. ఈ సినిమా ప్రొడ్యూసర్ నాచురల్ స్టార్ నాని కూడా ఒకో పార్ట్ ఒక్కొక్క హీరోతో చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడట. అంతేకాకుండా నాని హిట్ 2,3,4 పార్ట్ కూడా ఒక్కో హీరోతో తీసి ఆ హీరోలందరినీ కలిపి మరో సినిమా చేయాలని అనుకుంటున్నారని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. నాని ఓ భారీ మల్టీస్టారర్ కి ఇప్పటినుంచి పునాది వేస్తున్నారని అలాగే పార్ట్ వన్ పార్ట్ టూ కి అసలు కథ విషయంలో సంబంధం ఉండదని కూడా విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.