మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ కాలాన్ని చూస్తారని వేణు స్వామి చెప్పారు.

బాలకృష్ణకు జ్యోతిష్యం, దేవుళ్ల‌ గురించి న‌మ్మ‌కం ఎక్కువ‌న్న‌ది మనం చెప్పక్కర్లేదు. ఆయనకు వాటి గురించి అన్ని తెలుసు. ఆయనకు తెలిసిన వాటిలో కొన్ని మనకు తెలియదు. ఆయనే అన్ని చూసుకుంటారు అంటూ వేణు స్వామి చెప్పారు. బాలకృష్ణ జాతకాలని నమ్ముతారు అని.. ఆయన కుమారుడు మోక్షజ్ఞ జాతకం నేను చూశానని ఆయన సినిమాల్లోకి రావడానికి ఇంకా టైం పడుతుందని వేణు స్వామి అన్నారు.

Nandamuri Mokshagna Star Hero MLA Nandamuri Balakrishna's Son Mokshagna  Latest Viral Photos | Nandamuri Mokshagna: అబ్బాయ్ మోక్షజ్ఞతో బాలయ్య -  వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటోలు

మోక్షజ్ఞ సినిమా కెరియర్ చాలా బాగుంటుంది. టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదుగుతాడు. ఈ క్రమంలోని బాలకృష్ణ మోక్షజ్ఞను ఎంత లేటుగా టాలీవుడ్ కి పరిచయం చేస్తే అంత మంచిదని వేణు స్వామి అన్నారు. ఇంకా నాలుగు సంవత్సరాలు తర్వాత సినిమాల్లోకి వస్తే మోక్షజ్ఞ కు చాలా బాగుంటుందని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్‌ చేశాడు. ఇక మోక్షజ్ఞ జాతకం ప్రకారం ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ఛాన్స్ లేదు అని వేణు స్వామి చెప్పారు.