దుమ్ము దులిపేస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ట్రైలర్.. కౌబోయ్ గా అదరగొట్టిన బాలయ్య!

బాలయ్య అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ట్రైలర్” సరిగ్గా గంట క్రితమే రిలీజై హోరెత్తిస్తోంది. అవును, ఆహాలో అలరించిన ఈ టాక్ షో గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ దీనిని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయ‌న త‌న‌దైన మేనరిజంతో యాంక‌రింగ్‌ అనే పదానికి అర్ధాన్ని మార్చేశారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 గ్లోబల్ నెంబ‌ర్ 1 టాక్ షోగా నిలిచి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి విదితమే. కాగా ఇప్పుడు మ‌రోసారి నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ‌మ‌య్యారు.

తాజాగా దీనికి సంబంధించిన టీజ‌ర్‌ రిలీజ్ కాగా, ఇపుడు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అవును, త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్షకులకు మరింత ఎక్స్ట్రా ఫన్ ఇవ్వడానికి అన్‌స్టాపబుల్ సీజ‌న్ 2 సిద్ధ‌మవుతోంది. కాగా అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆహా నిర్వాహకులు వెల్లడించారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే, బాలయ్య ఓ కౌబోయ్ గెటప్ లో ఓ గుహలోని నిధిని అన్వేషిస్తూ వెళతారు. అక్కడ ఆయనకు అనేకరకాల సవాళ్లు ఎదురవుతాయి.

“అంధకారభయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమేజనబుల్… అక్కడేదురయ్యే సవాళ్లు అన్ ప్రెడిక్టబుల్.. అయినా ఆగని మన పోరాటం ఈ అన్‌స్టాపబుల్… గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్” అని బాలయ్య చెప్పిన డైలాగులు గూస్ బాంబ్స్ తెప్పిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆయన కత్తి పట్టుకుని చెబుతున్న ఈ డైలాగ్, విజువల్స్.. అన్‌స్టాపబుల్ సీజన్ 2పై మరింత అంచనాలను పెంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.