ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా చేస్తున్న తప్పు మొబైల్స్ ఎక్కువుగా వాడటం. అవసరమైన అంత వాడుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మంచో చెడో తెలియదు కానీ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాక చాలా రోగాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పదే పదే వాడడం ద్వారా అబ్బాయిలకు చాలా ఇబ్బంది కలిగించే జబ్బులు వస్తున్నాయట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మనకు తెలిసిందే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేనిదే పని ముందుకు సాగదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కచ్చితంగా ఎలక్ట్రానిక్ వాటితోనే పని ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అబ్బాయిలకైతే ఫోన్లు ,లాప్ ట్యాప్ లు వీటితోనే సమయం అంతా గడపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే కొందరు యువత నిద్రపోయే ముందు ఫోన్స్ ని తల కింద పెట్టుకోవడం.. లాప్ ట్యాప్ ని ను ఒళ్ళో పెట్టుకోవడం వంటి బిగ్ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇలా చేయడం చాలా డేంజర్. తప్పని తెలిసినా కూడా కొందరు సమయం లేక తెలిసి తప్పులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అబ్బాయిలకు పిల్లలు పుట్టే కెపాసిటీ తగ్గిపోతుందట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి రాకముందు మగవాళ్ళల్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉండిందట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య దాదాపు 40 శాతం పెరిగిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాదు కొందరు అబ్బాయిలు ఎక్కువగా రాత్రులు ఫోన్ చూడడం మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఒళ్ళో లాప్ ట్యాప్ ని పెట్టుకొని గంటలు గంటల వర్క్ చేయడం ..ఆ రేడియేషన్ నరాలకు లాగేయడం ..తద్వారా పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండడం వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు.
ఈ క్రమంలోని అబ్బాయిలు తమ ఆరోగ్య సమస్యపై కొంచెం జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పుకొస్తున్నారు. అమ్మాయిలతో కంపాక్ట్ చేస్తే అబ్బాయిలు ఎక్కువగా లాప్ ట్యాప్స్ ఉపయోగిస్తున్న కారణంగా వాళ్లలోనే ఎక్కువగా ఈ సమస్యలు వస్తున్నాయట. దీంతో పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ..పెళ్లయిన అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్స్.