ఆర్ ఆర్ సినిమా నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో వ‌చ్చిన‌ సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.

`త్రిబుల్ ఆర్` సినిమా చూసిన హాలీవుడ్ ప్రేక్షకులు, దర్శకులు దర్శకధీరుడు పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా రీసెంట్గా ఈ మూవీ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికిషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా సినిమా ఈ ముద్దుగుమ్మకు ఏమాత్రం నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. నికిషా పటేల్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి `కొమరం పులి` సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా పరాజయం కావడంతో తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించి చూస్తే అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవడంతో తిరిగి తన స్వదేశమైన బ్రిటిష్ కి వెళ్ళిపోయింది.

అయితే ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్న క్రమంలోనే తాజాగా `త్రిబుల్ ఆర్` సినిమా చూసిన ఈమె సినిమా నచ్చలేదంటూ ఆ విషయాన్ని ధైర్యంగా ట్వీట్ చేస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించింది. పైగా చూసిన ప్రతి సినిమా నచ్చాలని లేదు.. ఎవరి నిర్ణయం వారిది.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ చూసిన నందమూరి అభిమానులు మరియు మెగా అభిమానులు ఈమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా ఆమెకు నచ్చక పోవడం ఏంటి అంటూ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.

 

 

Share post:

Latest