ఆ కోలీవుడ్ స్టార్ హీరో కూతుర్నే ప్రేమించి మోసపోయిన స్టార్ హీరో విశాల్.. అసలు ఏం జరిగిందంటే..!?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.. ఈయన కోలీవుడ్‌లో టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ ఉంది. విశాల్ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు. అక్కడే వరస సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయ‌న చేసే ప్రతి సినిమా ఎంతో కొత్తగా ఉంటుంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్.

Tamil actor Vishal gets engaged to longtime girlfriend Anisha Alla- The New  Indian Express

ఆయన సినీ కెరియర్లో ఆయనపై చాలా రూమర్లు వచ్చాయి. ఏ సినిమా పరిశ్రమ తీసుకున్న అక్కడ ఉన్న స్టార్ హీరో మీద లవ్ ఎఫైర్లు లేకుండా ఉండవు.. ఈ క్రమంలోనే విశాల్ మీద కూడా తన కెరియర్ మొదటలో ఆయనపై కూడా వార్తలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు ఒక తెలుగు అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందా. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. ఈ నిశ్చితార్థం కన్నా ముందే విశాల్ ఓ కోలీవుడ్ స్టార్ హీరో కూతురుతో లవ్ ఎఫైర్ ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ నటి మరి ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్..ఈమే ఇప్పుడు తెలుగు సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ.. బిజీ స్టార్ గా కొనసాగుతుంది. అయితే ఈమే హీరోయిన్గా చేసిన మొదటి సినిమా మ‌ర‌గ‌ద‌రాజ‌. సినిమాలో విశాల్ కి జంటగా నటించింది. ఈ సినిమాతోనే హీరోయిన్గా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.

Varalaxmi Sarathkumar to Vishal: Have some class and grow up

ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమనే విధంగా ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లేవారు. సీక్రెట్ గా కలుసుకోవడం లాంటివి కూడా చేశారు. వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో బాగా వచ్చాయి. కానీ వారిద్దరు మాత్రం ఈ విషయంపై ఏం సమాధానం చెప్పకుండా దాటవేసేవారు. మేమిద్ద‌రం మంచి స్నేహితులం అంటూ చెబుతూనే ఈ రూమర్లకు మాత్రం వాళ్ళు పుల్ స్టాప్ పెట్టలేదు. ఈ వార్తలపై కొంద‌రేమో విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ను వాడుకుని వదిలేసారని చెబుతున్నారు… ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

Share post:

Latest