ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా నాకు చాలా స్పెషల్ .. రమ్యకృష్ణ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రమ్యకృష్ణ పేరు చెప్పగానే గుర్తుపట్టని వారు అంటూ ఎవరూ ఉండరు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా యువ హీరోయిన్లకు పోటీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది రమ్యకృష్ణ అయితే తాజాగా జరిగిన ఒక షోలో రమ్యకృష్ణ తన జీవితంలో జరిగిన ఒక అనుభవం గురించి తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

Cinema Song Lyric: Naa Alludu telugu movie songs lyrics
రమ్యకృష్ణ ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించింది సౌత్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి మంచి పేరు సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ఈమె మరింత క్రేజ్ ను అందుకుందని చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి ఫ్యూచర్ ప్రాజెక్టులలో కూడా రమ్యకృష్ణనే నటిస్తూ ఉన్నది. తాజాగా విజయ్ దేవరకొండ తల్లిగా లైగర్ సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది తన ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నది రమ్యకృష్ణ.

Jr NTR movies list
ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉంది. తాజాగా తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు. ఇక అలాగే ఆహార ప్రసారమవుతున్న జూనియర్స్ డాన్స్ ప్రోగ్రాం లో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.. ఇక అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ల తల్లిగా నటించింది. అందులో సయ్య సయ్యారే అనే పాటను చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ నాలుగు నెలల ప్రెగ్నెంట్ ఆట. అందుచేతనే ఆ సినిమా.. ఆ సాంగ్ నాకు స్పెషల్ అని తెలియజేసింది దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.