ఫ్యాన్స్ మ‌ధ్య మాస్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన త‌మ‌న్నా.. వీడియో వైర‌ల్‌!

మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓ పక్క సినిమాలలో హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే తాజాగా ఓ కార్యక్రమంలో త‌మ‌న్నా ఫ్యాన్స్ తో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చెన్నైలో జరిగిన ఈవెంట్ కి మెయిన్ గెస్ట్ గా అటెండ్ అయినా త‌మ‌న్నా అక్కడ అభిమానులతో కలిసి మాస్ డాన్స్ చేసింది. చెన్నైలో తాజాగా మెటా క్రియేటర్స్ డే అనే ఈవెంట్ జరిగింది.

అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్న.. విజయ్ దళపతి `మాస్టర్` సినిమాలో “వాతి కమింగ్“ అనే పాటకు మాస్ స్టెప్పులు చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తమన్నా డాన్స్ కు సంబంధించిన వీడియో ట్విట్టర్లో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే తమన్నా ఇటీవల బబ్లీ బౌన్సర్, అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాలతో ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆమె నటించిన `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

https://twitter.com/MissB_Fan/status/1585600096171098112?s=20&t=vdhUDVRwttw9exq_E6LTSg