సూపర్ స్టార్ కృష్ణ పై ఇష్టంతో శ్రీదేవి నిజంగా అలాంటి పని చేసిందా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సంచలనాలు సృష్టించారు. కృష్ణ గారు తెలుగు సినిమాలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు. అంతేకాకుండా ఈయన ఒక హీరోగానే కాకుండా ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్టార్ హీరో. అప్పట్లో ఆయన సంవత్సరానికి 12 నుంచి 14 సినిమాలు దాకా చేసేవారట అవన్నీ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేవ‌ట. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హీరోయిన్స్ తో జత కట్టిన కూడా ఎక్కువగా శ్రీదేవితో చాలా సినిమాలు చేశారట.

శ్రీదేవి బాలనటిగా వెండితెరకు పరిచయమై అప్పట్లో హీరోలకు కూతురిగా మనవరాలుగా నటించి టీనేజ్ లోకి వచ్చాక అదే హీరోలతో కలిసి స్టెప్పులేసింది. అలా శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలలో కూడా బాలనటిగా నటించింద‌ట‌.. ఆ తరువాత కాలంలో ఆయన జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసింది. ఇక అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్ అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడిచేదట.

సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి జంటగా కలిసి దాదాపు 31 రెండు సినిమాలు నటించారట. వీరిద్దరూ జంట కట్టిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయట. అప్పట్లో శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ పై ఇష్టంతో బాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకుని కృష్ణ గారితో సినిమా చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏదంటే విజయబాపినీడు డైరెక్షన్లో వచ్చిన `మహారాజశ్రీ మాయగాడు` అనే సినిమా సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి నటించింది. అదే సమయంలో శ్రీదేవికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చినా సరే.. ఆమెకు ఈ సినిమాలో పాత్ర నచ్చడంతో పాటు.. కృష్ణ గారిపై ప్రేమతో, వారితో నటించాలనే ఆలోచనతో ఆమె ఈ సినిమాకు సైన్ చేసిందట. అప్పట్లో శ్రీదేవి కృష్ణ గారి కోసం బాలీవుడ్ ఆఫర్ నీ సైతం వదులుకుంది అని చాలా వార్తలు వచ్చాయి.

Share post:

Latest