రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెద‌ర‌ని రికార్డు మీకు తెలుసా…!

ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు ప‌లు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు.

అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో చాలా రీమేక్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ తరం హీరోలు ఒకటి రెండు సినిమాలే కాదు ఏకంగా 10 పైనే సినిమాల్లో నటించిన వారు ఉన్నారు. ఇక వీరులో ఒక స్టార్ హీరో అయితే ఏకంగా 50 రీమేక్ సినిమాలో న‌టించారు. టాలీవుడ్ లో రీమేక్ సినిమాల్లో నటించిన సీనియర్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

NTR death anniversary: సీనియర్ ఎన్టీఆర్ 25వ వర్ధంతి.. అన్నగారి కెరీర్‌‌కు  1977 ప్రత్యేకం.. | Sr NTR death anniversary special this was the most  memorable year in his career 1977 pk– News18 Telugu

సీనియర్ ఎన్టీఆర్:
సీనియ‌ర్ ఎన్టీఆర్ దాదాపు 50 రీమేక్ సినిమాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్నారు ఇప్పటి వరకు ఆయన చేసిన రీమేక్ సినిమాలు టాలీవుడ్ లో ఎవరూ చేయలేదు. ఈ విష‌యంలో ఆయ‌న‌ది ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని రికార్డ్‌.

అక్కినేని నాగేశ్వరరావు:
ఎన్టీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కూడా అంతే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ లో ఈయ‌న‌ కూడా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా నిలిచారు. ఈయన కూడా తన కెరియర్‌లో ఏకంగా 42 రీమేక్ సినిమాల్లో నటించాడు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు:
మరో సీనియర్ నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తన సినీ కెరియర్లో దాపు 25 రీమేక్ సినిమాల్లో నటించాడు.

సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ కూడా టాలీవుడ్ లో ఎన్టీఆర్- ఏఎన్ఆర్ తర్వాత ఎంతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు. ఆయ‌న‌ 11 రీమేక్ సినిమాల్లో నటించారు.